జనగామకు ఐపీఎస్ అధికారి
SHO గా చార్జి తీసుకున్న మనన్ భట్ IPS..
ఇక నుంచి ట్రైనీగా జనగామలో సేవలు
జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా చాటిన మనన్ భట్ ట్రైనీ అధికారిగా జనగామలో అడుగు పెట్టారు.ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఆయన కొన్ని రోజులు సేవలందించనున్నారు.ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన చార్జి తీసుకున్నారు.చార్జి తీసుకునేందుకు వచ్చిన ఆయనకు జనగామ ఏసీపీ పార్థసారథి,సీఐ దామోదర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.జమ్మూ కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌కు చెందిన భట్ 2023 యూపీఎస్సీ ఫలితాల్లో 88వ ర్యాంకు సాధించి ఆ రాష్ట్రంలో పాపులర్ అయ్యారు.ఐఐటీ శ్రీనగర్‌లో బ్యాచిలర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పూర్తి చేశారు.ఆ తరువాత సివిల్స్‌కు సన్నద్ధమైన భట్ 2023 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. ఈయన 2021లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా కూడా ఉద్యోగం సాధించినట్లు తెలిసింది.