కృష్ణాజిల్లా మెట్లపల్లిలో వలలో చిక్కిన చిరుత మృతి?
కృష్ణా జిల్లా:
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. స్థానిక రైతు ఒకరు పంట రక్షణకు, పందులకు పెట్టిన వల ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి చెందింది.
నెల రోజుల క్రితం చిరుత కదలికను గమనించిన రైతు అధికారులు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ముందు జాగ్రత్తగా పంటకు రక్షణగా వలలను బిగించుకున్నాడు.
రాత్రి చిరుతపులి అటుగా వచ్చి అందులో చిక్కుకుని మృతి చెందింది. సమాచా రం అందుకున్న అటవీశాఖ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.