కనులు విందుగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు.

Sakshitha news

కనులు విందుగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు.

కన్నయ్య మమ్మల్ని ఆశీర్వదించయ్యా.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నాలుగవ శ్రావణ శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా పూజారి నందకిషోర్ పర్యవేక్షణలో సాంప్రదాయ బద్ధంగా, పరిమళ పుష్పాలతో, వేద పండితుల మంత్రోచ్ఛారణతో, శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఉభయకర్తలుగా రాజావిజయనరసింహారావు,సుష్మ దంపతులు’ఉభయ, నైవేద్యాలు, భయ భక్తులతో సమర్పించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణుని దర్శించుకుని ఆ కన్నయ్య కృపాకటాక్షం పొందారు. అనంతరం వాసవి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో, జై వాసవి మాత నినాదాలతో పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ యస్. రమేష్ బాబు, కోశాధికారి మెంటా రమేష్ బాబు, ఆర్యవైశ్య భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.