అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శమూర్తి..
పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి
నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విచ్చేసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి.. పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ .ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు,ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి.. ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 8 వ డివిజన్ కార్పొరేటర్ కామాక్షి దేవి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్, వైఎస్ఆర్సిపి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు మంచి కంటి శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి నగర వాణిజ్య విభాగం అధ్యక్షులు జెమిలి శ్రీనివాసులు,వై సి పి వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి పి. మల్లికార్జున్, ఆర్యవైశ్య నాయకులు పబ్బిశెట్టి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
