స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రత పై ర్యాలీ నిర్వహించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్య నగర్ లో పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలలో అవగాహన కోసం డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చెత్తను రోడ్ల మీద వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్త మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. జి.ఎచ్.ఎం.సి సిబ్బంది మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి చెత్తను రోడ్లమీద వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు. అలాగే మీ ఇంటికి వచ్చి సేవలందించే పారిశుధ్య, ఎంటమాలజి మరియు వైద్య శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించి వారి సూచనలు పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు
కార్యక్రమంలో నాయకులు జూపల్లి జనార్దన్ రావు, నాగేశ్వరావు, దేవేందర్ రావు, జీవన్ రెడ్డి, జంగారెడ్డి, మహీందర్ రావు, ఎల్లయ్య, బాలాజీ, వెంకటరెడ్డి, రమేష్ సేటు, అశోక్ రావు,
జి.ఎచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ మనోహర్ రెడ్డి, ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, ఎస్.ఎఫ్.ఏ లు మల్లేష్ మరియు వెంకటరెడ్డి, జి.ఎచ్.ఎం.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
