స్పీకర్ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు సహించేది లేదు

Sakshitha news

స్పీకర్ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు సహించేది లేదు

తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి – కాంగ్రెస్ డిమాండ్

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అన్నపురెడ్డిపల్లి మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల నరేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ముఖ్యఅతిథిగా *డి సి సి జనరల్ సెక్రటరీ వనమా గాంధీ SCCL జిల్లా జనరల్ సెక్రెటరీ యాదాల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను, అందులోనూ ఒక దళిత నాయకుడిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే ఎమ్మెల్సీ పదవి నుంచి తాతా మధును తొలగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవి గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధినేతగా కేసీఆర్ కూడా స్పందించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు

– అన్నపురెడ్డిపల్లి మండల యూత్ కాంగ్రెస్