ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
నేటి యువత సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ కనుమరుగైపోతున్న క్రీడలను జీవం పోయాలని కోరిన….. ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య
సాక్షిత వనపర్తి ఆగస్టు 29. శనివారం
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో స్పోర్ట్స్ కన్వీనర్ యువ రూపాలక్ష్మి, ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేటి యువత యాంత్రిక జీవన విధానాల్లో వచ్చిన మార్పు కారణంగా శారీరక శ్రమ తగ్గిపోయి మానసిక ఒత్తిడి పెరిగి దయానందన జీవితంలో మానసిక శారీరక సామాజిక రుగ్మతలకు లోన్ అవుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అందుకు శారీరక శ్రమ తగ్గిపోయడం వల్ల అని క్రీడల సాధన వలన శారీరిక దృఢత్వంతో పాటు మానసిక రుగ్మతల నుండి బయట పడవచ్చు అని కావున క్రీడల పై ఆసక్తి పెంచుకొని కనుమరుగై పోతున్న కబడ్డీ, హాకీ లాంటి క్రీడలకు జీవం పోయాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీరామరాజు యాదవ్ స్పోర్ట్స్ కో కన్వీనర్ డాక్టర్ కె విజయలక్ష్మి డాక్టర్ పోతురాజు శ్రీనివాస్ డాక్టర్ జి సుష్మ స్రవంతి ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
