ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజావాణి నిర్వహించకపోవడం దారుణం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

Sakshitha news

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజావాణి నిర్వహించకపోవడం దారుణం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

జిల్లా కలెక్టరేట్,మున్సిపల్ కార్యాలయంలో పాటు మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయంలో మాత్రం ప్రజావాణి నిర్వహించట్లేదని దరఖాస్తులు ఎప్పటిలాగే ఇన్ వార్డులో ఇచ్చి వెళ్తున్నారని ఇది ప్రభుత్వ నిర్ణయాలను సాక్షాత్తు ప్రభుత్వ అధికారులే అమలు చేయకపోవడం దారుణమని వెంటనే ఎమ్మార్వో వచ్చే నుండి ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు లేనిపక్షంలో అడిషనల్ మరియు జాయింట్ కలెక్టర్లు కూర్చొని ఫిర్యాదులను స్వీకరించి ఆ సమస్యల పైన అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తారని అదేవిధంగా ఇక్కడ కూడా జరగాలని కోరారు.


ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఉపయోగించుకోవాలని సదుద్దేశంతో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ అన్ని సమస్యలు పరిష్కరించకపోయినప్పటికీ ప్రజలకు ఇంకా ప్రజావాణి పై విశ్వాసం ఉందని దాన్ని అధికారులు సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ప్రారంభమైనప్పుడు ఉన్నంత స్పందన నేడు లేకపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచాలని ఇలాంటి కార్యక్రమాల పైన పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయని అధికారులను సస్పెండ్ చేయాలని అన్నారు.