జెన్ జి ఉద్యమంలో మనం కూడా భాగస్వాములు కావాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
అఖిల భారత యువజన సమాఖ్య కుత్బుల్లాపూర్ మండల మహాసభ నేడు మఖ్దుం నగర్ సిపిఐ కార్యాలయంలో
ఏ ఐ వై ఎఫ్ కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ మహాసభలకు ముఖ్యతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సల్మాన్, సత్యప్రసాద్ లు పాల్గొని మాట్లాడటం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు,ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు, అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు వంటి వాగ్దానాలు చేసి ఎన్నికలో గెలిచి ఎలాంటి హామీలను నిలబెట్టకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం లేదా తన అనుచరులైన అదానీ అంబానీకి అమ్మడం చేసి లక్షలాది మంది పొట్టగొట్టిన చరిత్ర కేవలం బీజేపీకే ఉంటుందని అన్నారు.పరీక్షల లీక్ పై ఉద్యమం చేస్తే బీజేపీ ఆర్ ఎస్ ఎస్ బత్తాయిలు వాళ్లను నక్సలైట్లని,కమ్యూనిస్టులని,దేశ ద్రోహులని ప్రచారం చెయ్యడం సిగ్గుమాలిన పనని,చివరికి వాళ్లే ప్రజలకు క్షమాపణ కోరారని అన్నారు.నీట్ ఉద్యమం ఒక గుణపాఠమని కావున ఉద్యమం చేస్తే ఏదైనా సాధ్యమని దానికి నాయకత్వం నేటి యువతనే వహించిందని అలంటి యువతను ఆదర్శ0గా తీసుకోని ఇక్కడి యువత రాజకీయాల్లోకి వచ్చి అవినీతి కబ్జాకోరుల చేతిల నుండి మన సమాజాన్ని రక్షించి మంచి నాయకులుగా,ప్రజాప్రతినిధులుగా ఎదగాలని కోరారు.
ఈ సందర్బంగా సిపిఐ మండల కార్యదర్శి స్వామి మాట్లాడుతూ యువత నిర్వహించే అన్ని ఉద్యమాలకు సిపిఐ మద్దతు ఉంటుందని అన్నారు.
సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్ష కార్యదర్శులుగా ప్రవీణ్ కీర్తి కోశాధికారిగా వి సురేష్ లతోపాటు తొమ్మిది మంది ని ఆఫీస్ బేరాలుగా తీసుకోవడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
