ఇందిరానగర్ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలన్ హన్మంతరెడ్డి

Sakshitha news

|| ఇందిరానగర్ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలన్ హన్మంతరెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి పరిధిలోని ఇందిరానగర్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ ఆలయంలో వైభవంగా నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని, అమ్మవారి దయాకటాక్షాలు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, సర్కిల్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, తో పాటు పరమేష్ నాయక్, రామ్మోహన్ రెడ్డి, సందీప్, బద్రి, హరికృష్ణ, శ్రీకాంత్, నాని, అర్జున్ మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.