సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

Sakshitha news

సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

శ్రీపాదరావు సేవలకు గౌరవంగా నూతన సెంట్రల్ హాల్‌కు నామకరణం….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, హైదరాబాద్// : తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుతో నూతన సెంట్రల్ హాల్‌కు నామకరణం చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటానికి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ్యులతో కలిసి నిర్వహించిన అల్పాహార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.

శ్రీపాదరావు ప్రజాసేవలు, శాసనసభ వ్యవహారాల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా సెంట్రల్ హాల్‌కు ఆయన పేరు పెట్టడం గౌరవప్రదమైన నిర్ణయమని పలువురు పేర్కొన్నారు.