ప్రగతి నగర్ లోని లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్ లో సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యా సదస్సు జరిగింది ఈ సదస్సుకు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సత్యం గారు అధ్యక్షత వహించారు.
ముఖ్య ఉపన్యాసకులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, ప్రజలు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యా వైద్య రంగాలను ప్రతిష్టత కొరకు గత మూడు నెలల నుండి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలలో భాగంగా మేడ్చల్ జిల్లాలో కూడా సర్వే నిర్వహించడం జరిగింది.
దానిలో విద్యా సంస్థలలో అవకతవకలు కనిపెట్టడం జరిగింది. ఈ సదస్సులో కామ్రేడ్ సత్యం గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 15 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో 85% మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంఖ్య ఉన్నంత విద్యల్లోకి వెళ్ళేటప్పటికి ఐదు శాతం మాత్రమే ప్రభుత్వ కళాశాలలోఉంటున్నారు. ఇంగ్లీష్ మీడియం ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే పిల్లలు ఎక్కువగా చేరుతున్నారు.
కానీ ఆ పాఠశాలలో టీచర్స్ లేరు, ఫెసిలిటీస్ లేవు, మెయింటెనెన్స్ కూడా సరిగా లేకుండా ఉన్నాయి . క్లీనింగ్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది తక్కువగా ఉన్నది. ఇటువంటి సమస్యల అనేక పాఠశాలలో ఈ సర్వేల్లో మేం కనిపెట్టడం జరిగింది. విద్య అందరి హక్కు. ఆ హక్కును కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం విద్యా చట్టం పేరుతో విద్యా వ్యవస్థని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది.
దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కామన్ స్కూల్స్ కావాలి. విద్యపై కేటాయింపులు పెరగాలి. జిడిపిలో 6 % శాతం కేటాయింపు చేయవలసి ఉండగా 1.9%. మాత్రమే కేటాయిస్తున్నారు. విద్యా విధానం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది. వాళ్ళకి అనుకూలంగానే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. NEP 2020 లో ఎడ్యుకేషన్ మొత్తాన్ని కేంద్రీకరణ చేయాలని చెప్పి చట్టం తీసుకురావడం జరిగింది.
దానితోపాటు దానిలోనే NEP 2020 లోనే విద్య మొత్తం కాషాయీకరణ వైపు మళ్లించాలని చెప్పడం జరిగింది. ఉత్పత్తి విధానాలకు తగ్గట్టుగా ఎడ్యుకేషన్ ఉండాలి. దానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నది. విద్యా అనేది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉత్పత్తి విధానం ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పటం జరిగింది.
ముఖ్య ఉపన్యాసకులు ఆమంచి నాగేశ్వర్ గారు మాట్లాడుతూ… ఈమధ్య ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది రాస్తే ప్రత్యక్షంగా బాధితులు దాదాపు కోటి మంది ఉన్నారు. దీనివల్ల అనేకమంది చనిపోవడం జరిగింది. గత 12 సంవత్సరాల నుండి మీడియా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియా ఉపయోగించడం బాగా పెరిగింది. దాని ఫలితంగా ప్రజల్లో బాగా ఈ విషయం చర్చినీయాశంగా మారి బాగా అర్థం చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
ప్రజలలో ఎక్కువ కుటుంబాలు ఆదాయంలో ఎక్కువ భాగం తమ పిల్లల విద్యపై ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం విద్యపై 6% కేటాయించవలసి ఉండగా కేవలం 2 శాతం కూడా దాటడం లేదు. NEP2020 పేరుతో కేంద్రం చేసిన విద్యా చట్టంలో 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంటు 50 శాతానికి పెంచాలని నిర్ణయించడం జరిగింది . అయితే ఇంకొక విషయం దానిలో పేర్కొన్నది ఒకేషనల్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పడం జరిగింది.
అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పడం జరిగింది అది ఆల్రెడీ కేరళ గుజరాత్ లో ఉన్నది. దీనిలో దీని ద్వారా ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళు డిజిటల్ యూనివర్సిటీలో ద్వారా తమ చదువుని కొనసాగించవచ్చు. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ ని అటానుమస్ కాలేజెస్ గా చేయాలని గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. అటాన్‌మస్ చేస్తే స్వతంత్ర నిర్ణయాలతో కొత్త కోర్సులు ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఆలోచన.
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి బీటెక్ స్టూడెంట్స్ కి తేడా స్పష్టంగా కనబడుతున్నది బీటెక్ వాళ్లకు పాలిటెక్నిక్ వాళ్ల కన్నా నాలెడ్జి తక్కువగా ఉంటోంది. అంతేకాకుండా ద్విభాష త్రి భాష విధానం పెట్టాలని చర్చ కూడా ఉన్నది. దానిపై జూనియర్ కాలేజీలు, యూనివర్సిటీ మేనేజ్మెంట్స్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ కూడా అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా NEP 2020 లో ఏదేని రెండు భాషలు అంటే హిందీ మరియు మాతృభాష ఉండాలని, సంస్కృతాన్ని కూడా ఎంకరేజ్ చేయాలని, ఇంగ్లీష్‌ని డిస్కరేజ్ చేయాలని ఉన్నది.
అయితే దీనిపై మేనేజ్మెంట్స్ ప్రెజర్స్ పెట్టడం వల్ల కొంత మార్పులు చేయడం జరిగింది. కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వటం జరిగింది . అట్లాగే ఒకేషనల్ విద్య 8th క్లాస్ నుండి స్టార్ట్ చేయాలని చెప్తూ ఉన్నది. దీనివల్ల ఆర్థికంగా వెనకబడిన వారు మాత్రమే నేర్చుకుంటారు దీంతో కులవృత్తులపై ఆధారపడే వాళ్ళు పెంచటానికి ప్రభుత్వ ప్రయత్నం చేస్తున్నది.
దేశంలో 2025 26 లెక్కల ప్రకారం 8 .75 మంది చదువుకున్న వాళ్లకు వర్క్ లేదు 10% మంది ఉపాధి లేనివారు. 14.8 శాతం మంది జాబు లేనివాళ్లు, 29. 4 శాతం మంది ఉన్నత చదువులు చదివిన వారు, 20 శాతం మంది విద్యా వైద్య రంగంలో ఉన్న వాళ్ళు జాబ్ లెస్ లో ఉన్నారు అలాగే దేశ జనాభాలో 15.4 శాతం మంది ఇంట్లో ఖర్చు తగ్గించుకుని విద్యపై ఖర్చు పెడుతున్నారు. 58 శాతం మంది ఒక సంవత్సరం నుండి ఉపాధి కోసం చూస్తున్నారు. 29 శాతం మంది రెండు సంవత్సరాల నుండి ఉపాధి కోసం చూస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కోసం మోడల్ స్కూల్స్ పెడతామని చెబుతూనే ఇప్పుడున్న 4000 స్కూల్స్ మూసేస్తాం అంటున్నారు. అలాగే యంగ్ ఇండియా గ్రేటర్ స్కూల్స్ కి కొన్ని కాలేజీలను అటాచ్ చేస్తున్నాము అంటున్నారు.మన డిమాండు NEP 2020 వెనక్కి తీసుకోవాలి. టీచర్స్ ని ప్రొఫెసర్స్‌ని నియామకాలు పెంచాలి. విద్యాసంస్థల్లో సదుపాయాలు పెంచాలి అని చెప్పడం జరిగింది.
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ…. విద్యా వైద్యం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని మనం అడుగుతుంటే అన్ని ప్రైవేట్ చేస్తామని అంటున్నారు. ప్రస్తుతం 80% విద్యాసంస్థలు ప్రైవేట్ లోనే ఉన్నాయి. జూనియర్ కాలేజీలు 42 ప్రభుత్వంలో ఉంటే 350 ప్రైవేట్ లో ఉన్నాయి.
ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మెజారిటీ ప్రైవేట్ లోనే ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యాసంస్థల్లో టీచర్స్ గాని, ప్రొఫెసర్స్ గాని, ఫెసిలిటీస్ గాని సరిగా ఉండటం లేదు. అనేక మంది రకరకాల పనులు చేసుకుని బ్రతికేవారు పిల్లలను మంచి చదువు కోసం ప్రయత్నించేవారు ఆదివాసులు పేదలు, చదువులో ధనవంతులతో పోటీపడే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. అందరికి సమానంగా ఉండాల్సిన అవకాశాలు లేకుండా పోతున్నాయి. దాదాపు 26 వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు పేరుతో లూటీ చేస్తూ ఉన్నాయి .
రాష్ట్రంలో 14 శాతానికి గాను ఎనిమిది శాతం సెంటర్లో ఆరు శాతం గాను రెండు శాతం విద్యకి ఖర్చు పెడుతున్నారు. కేంద్రంలోని ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. మోడల్ స్కూల్స్, డిగ్రీ కాలేజీలు, మోడల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న వాటిని మూసేస్తున్నారు.
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివే అవకాశాలు మెరుగుపరచాలి. వైద్యం కూడా అలాగే సరైన సదుపాయాలు లేక వైద్యం అందడం లేదు. డాక్టర్స్, ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్స్ లో ఫీజులపై బోర్డులు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో కాలేజీలలో ఫీజులపై బోర్డులు ఏర్పాటు చేయాలి. తెలంగాణలో 30 లక్షల మందికి ఇల్లు లేవు. ధనవంతుల కుటుంబాలపై రెండు శాతం పన్ను విధించాలి.
ఈ అసమానతలకు కారణం ప్రభుత్వాలే. ఏ ప్రభుత్వం అయినా ధనవంతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు జరుగుతాయి. దేశంలో అనేక పాఠశాలలో సౌకర్యాలు లేకుండా ఉన్నాయి.వాటిని పరిశీలించడానికి వెళ్తే దాడి చేస్తున్నారు. ప్రభుత్వంతో అనేక పోరాటాల ద్వారా ఒత్తిడి చేయాల్సి ఉంది. భవిష్యత్తులో జరిగే పోరాటాలు అన్నిట్లో ప్రజలు భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ సదస్సులో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రవి, అశోక్, శ్రీనివాసులు, రాజశేఖర్ మరియు జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, బి.వెంకట రామయ్య, లింగస్వామి,నరేష్, లక్ష్మణ్,శ్రీనివాస్ సిపిఎం మండల డివిజన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు, అలాగే దాదాపు 400 మంది వరకు విద్యార్థులు, ప్రజలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
