అమరజీవి కామ్రేడ్ బేతిని రాఘవయ్య 28వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన : సిపిఎం పార్టీ
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండల పరిధిలోని నాచారం గ్రామంలో సిపిఎం పార్టీ నాయకులు అమరజీవి కామ్రేడ్ బేతిని రాఘవయ్య 28వ వర్ధంతి
ఘనంగా నిర్వహించారు. మొట్టమొదట రాఘవయ్య స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు యండ్రాతి అప్పారావు ఎగురవేశారు. చిత్రపటానికి పూలమాల మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మినారాయణ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తరువాత పార్టీ మండల కమిటీ సభ్యులు పిల్లి నాయుడు అధ్య క్షతన సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ మండల కార్యదర్శి మరియు జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి శ్రీనివాసరావులు మాట్లాడుతూ అమరజీవి బేతిని రాఘవయ్య ప్రపంచంలోనే మహత్తరమైన గొప్ప సిద్దాంతం కలిగిన మార్క్సిస్టు సిపిఎం పార్టీ ని నమ్మి ఎర్రజెండాను చేతబట్టి కార్మికుల కోసం వ్యవసాయ కార్మికులు, రైతులు పేదలు కోసం జీవితాంతం పనిచేశారని కొనియాడారు. ఈప్రాంతంలో పార్టీ అభ్యర్థి కోసం ఎనలేని కృషి చేశారు అని ఘనంగా నివాళులు అర్పించారు. రాఘవయ్య ఏఆశయాల కోసం పనిచేశారో వాటి అమలు కోసం మనందరం పనిచేసినప్పుడు రాఘవయ్యకి ఘనంగా నివాళులు అర్పించిన వారం అవుతాం అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలుచేయడం కోసం పాలకవర్గాలు మెడలు వంచి పోరాటాల ద్వారా ప్రజల తరుపున మనం పనిచేయాలని కోరారు. అప్పుడే బేతిని రాఘవయ్య ఆశయాలు సాధించిన వారు మవుతాము అని రాఘవయ్య కి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సభలో నాచారం పార్టీ శాఖా కార్యదర్శి ఆభోతు చెన్నకేశవలు,
కొండారు యల్లమంద, యండ్రాతి, సత్యం, కోమటి వెంకటేశ్వరరావు శ్రీరాంపురం గ్రామపార్టీ మండల కమిటీ సభ్యులు మోరంపూడి కేశవరావు, పర్వతనేని కాంతారావు, నాచారం డాక్టర్ రవీంద్ర, సుదర్శన రావు, ఆర్. సూరిబాబు, పాపారావు, కోమటి రంగయ్య, రామారావు, బేతిని రాఘవయ్య మనుమడు బేతిని రమేష్, నాచారం గ్రామ, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
