మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మిద్దాం………….. జిల్లా న్యాయ సేవాధికార సమస్తసేవా సీనియర్ సివిల్ జడ్జ్ వి. రజని
*సాక్షిత వనపర్తి :
విద్యార్థులు మత్తు పదార్థాలకు మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలోని మదనాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని విద్యార్థులకు ఆర్టికల్ (14), ఆర్టికల్ (19) మరియు ఆర్టికల్ (21) యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఆర్టికల్స్ ను గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అంటారు అని తెలియజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి లీగల్ లిటరసీ క్లబ్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళలకు, చిన్నపిల్లలకు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, వయోవృద్ధులకు, మతి స్థిమితం లేని వారికి, సామూహిక విపత్తు మరియు మానవ అక్రమ రవాణా బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలియజేశారు. మరియు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం గురించి అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కొరకు NALSA 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమాలలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది అశోక్ గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్దిలేటి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రేణుక, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
