సాయిబాబా నగర్ డివిజన్‌లో సొంత నిధులతో CC రోడ్ల నిర్మాణం

Sakshitha news

|| సాయిబాబా నగర్ డివిజన్‌లో సొంత నిధులతో CC రోడ్ల నిర్మాణం ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 292 సాయిబాబా నగర్ డివిజన్‌లోని మోడీ బిల్డర్స్ FG బ్లాక్‌లో స్థానికులు తమ సొంత నిధులతో చేపడుతున్న CC రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమానికి *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు గార్లు ముఖ్య అతిథులుగా హాజరై వారి చేతుల మీదుగా CC రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొలన్ హనుమంత్ రెడ్డి గారు, మన్నె రాజు గారు స్థానికులను అభినందిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా వారు తమవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు.

➡️ అనంతరం FG బ్లాక్‌కు చెందిన పలువురు TRS నాయకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కొలన్ హనుమంత్ రెడ్డి గారు, మన్నె రాజు గారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో: టీ. శివ రామ కృష్ణ, బి. రాజేష్, ఎం. భూలక్ష్మి, ఎం. వీజ్రయ్య, టీ. శివ కుమార్, డి. నరసింహ చారి, కె. లోకేష్, కె. మంజీల, బి. లక్ష్మి, బి. సీత, టీ. సంధ్య రాణి, బి. వినయ్ కుమార్, సూర్య నారాయణ రాజు, ఆనంద్ వర్మ, సాగర్ తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు హరి కిరణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, డివిజన్ మైనార్టీ అధ్యక్షులు యాసిన్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు గురువా రెడ్డి, కరణ్, రామచంద్ర, నాగశిరోమణి, శైలజ, శోభ, రాజు చారి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి, స్థానిక అభివృద్ధి పనులకు సహకరించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.