నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

|| నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్‌కు చెందిన బిజ్జిలి కృష్ణ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన గృహంలో నిర్వహించిన స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, బిజ్జిలి కృష్ణ గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ద్వారంపూడి నాగిరెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు