ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
నందిగామలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే సౌమ్య
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ కాకాని నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన ప్రజలతో ఆమె మాట్లాడి, సమస్యల వివరాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, నిబంధనల మేరకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST