దుశ్యాసన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని….. బిఆర్ఎస్ డిమాండ్

Sakshitha news

దుశ్యాసన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని….. బిఆర్ఎస్ డిమాండ్

అరెస్టు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు విడుదల చేస్తూ మహిళా సభ్యులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్

హామీలు, గ్యారంటీలు నెరవేర్చాలని కలెక్టరేట్ ముట్టడి

సాక్షితవనపర్తి ప్రతినిధి
తెలంగాణఅసెంబ్లీ వద్ద
బి ఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళ శాసనసభ్యుల
పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసు గుండాలు వ్యవహరించిన తీరును కౌరవ పాలనలో దుర్యోధన సభలో దుశ్శాసన సంఘటనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఉందని అభివర్ణిస్తూ అరెస్టు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బేషరతుగా వదిలివేసి ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి చీరలు లాగి అమానుషంగా అవమానించిన మహిళా శాసనసభ్యులకు, తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇలాంటి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లు, 420 హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందని ప్రభుత్వ వైఫల్యాలపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వారం రోజుల ప్రజాస్వామ్య బద్ద నిరసనల్లో భాగంగా చివరి రోజు నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడిని చేపట్టారు అనంతరం 420 హామీలు గ్యారెంటీలను అమలు చేయాలన్న డిమాండ్ తో కూడుకున్న వినతి పత్రాన్ని ప్రజావాణిలో కలెక్టర్కు అందజేశారు అనంతరం బిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్లు మాట్లాడుతూ గడిచిన డెభై- ఎనభై ఏళ్లలో తెలంగాణలోని కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళా శాసనసభ్యులపై ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదని వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు నల్ల దుస్తులను ధరించి అసెంబ్లీలోకి వెళ్తున్న బిఆర్ఎస్ శాసనసభ్యులను అడ్డుకోవడం ఆప్రజాస్వామ్యమని ప్రజా గొంతుకగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ పై రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రాబోయే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గంధం పరంజ్యోతి ని మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్ ప్రేమ్ నాథ్ రెడ్డి నందిమల్ల అశోక్ గులాం ఖాదర్ గంధం విజయ్, నందిమల్ల రమేష్, సిరిగిరి మన్యం, మహిళ నాయకులు టిఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు