గ్రామస్థాయి వివో ఏ లకు రివ్యూ సమావేశం..

Sakshitha news

గ్రామస్థాయి వివో ఏ లకు రివ్యూ సమావేశం..

ప్రతి మహిళను లక్షాధికారి చేయడమే లక్ష్యంగా

కార్యక్రమంలో పాల్గొన్న ఏపిఎం.వి. సుబ్బరాజు

కోవూరు మండల సమాఖ్య కార్యాలయము నందు ఏపీఎం. వి. సుబ్బరాజు ఆధ్వర్యంలో గ్రామస్థాయి వివో ఏ లకు రివ్యూ సమావేశం.. అనంతరం వారు మాట్లాడుతూ మండల సమైక్య నందు మొత్తము 1350 గ్రూపులు 13380 మంది సభ్యులు సభ్యత్వం పొంది ఉన్నారు. ప్రతినెల రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించుకొని మొబైల్ బుక్ కీపింగ్ యాప్ ద్వారా డేటా నమోదు అవుతుందని వారికి వార్షిక రుణ ప్రణాళిక ప్రకారము యాప్ ద్వారా ఏ నెలలో ఎంత మొత్తము అప్పు కావాలో ఏసీఎల్పీ యాప్ లో నమోదు చేసుకొని ఆ విధంగా రుణము సక్రమంగా పొందుతున్నారు.

డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా సంఘం ఖాతా నుండి సభ్యురాలు ఖాతకు డబ్బులు జమవుతున్నాయి అక్కడి నుంచి డబ్బులు వారు డ్రా చేసుకొని వారి యొక్క జీవనోపాదుల కొరకు సద్వినియోగపరచుకొని లక్ష అధికారులుగా ఎదుగుతున్నారు. ఈ రుణ మంజూరు గురించి ఎవరికీ ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని నిత్యము సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతున్నది. శ్రీనిధి రుణాలు ఉన్నతి సిఐఎఫ్ బ్యాంకు లింకేజీలు సక్రమంగా రుణాలు పొందుతున్నారు. ఆ సెట్ టాకింగ్ కూడా ఆస్తులు ఏర్పరచుకుంటున్నారు సభ్యులందరూ సంతోషంగా కోవూరు మండల సమైక్య ద్వారా అభివృద్ధి చెందుతున్నారు. సబ్సిడీ రుణాలు కూడా బ్యాంకుల ద్వారా అర్హత కలిగిన వారికి అందజేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ పథకాల గురించి అవగాహన కల్పించడంకూడా జరిగింది. ఈ కార్యక్రమానికి సీసీలు మురళి, రాము, శోభ, వివోఏలు, అకౌంటెంట్ సుధారాణి, పాల్గొనడం జరిగింది..