శేరిలింగంపల్లి డివిజన్ లోగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ శేరిలింగంపల్లి వారి ఆధ్వర్యంలో పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి బాబురావు సహకారంతో విద్యార్థులకు ఉచిత డిక్షనరీల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని డిక్షనరీలు పంపిణి చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్, లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ కింగ్స్ ప్రెసిడెంట్ రాగం నాగేందర్ యాదవ్ , లయన్స్ క్లబ్ 320డి గవర్నర్ అమర్ నాథ్ రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. విద్య అనేది సామాజిక స్థిరత్వాన్ని ప్రోత్సహించే ఒక శక్తివంతమైన మార్గమని ఉన్నత విద్యతో దేశాభివృద్ధికి తోడ్పడవచ్చని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి, వారి భవిష్యత్తుకు తోడ్పడటానికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అందులో భాగంగా ఉపాధ్యాయుల కోరిక మేరకు తక్షణమే రూ. 1లక్ష రూపాయలతో సీసీ కెమెరాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి ఇంకా ఏవైనా పనులు కానీ సమస్యలు కానీ ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ శేరిలింగంపల్లి లయన్స్ క్లబ్ 320డి గవర్నర్ అమర్ నాథ్ రావు, విజయలక్ష్మి, ప్రవీణ్, డి లక్ష్మి నారాయణ గౌడ్, అశోక్ గౌడ్, జనార్దన్ రెడ్డి, సుధీర్, నర్సింలు, కరుణాకర్, రీజియన్ ఛైర్మెన్ రమణ, రంగారెడ్డి PRTU అధ్యక్షులు మహేందర్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బల్వంత్ రెడ్డి, ఉదయకుమారి, కర్ణ, లక్ష్మి, వీరేశం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
