జిల్లాలో అక్రమ రవాణాపై కఠిన చర్యలు – చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా: ఎస్పీ నరసింహ
సాక్షిత మోతెమండలం : అక్రమ రవాణాపై జిల్లా లొ ఉక్కు పాదం మోపుతున్నట్లు జిల్లా యస్పి నరసింహ అన్నారు గురువారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ను పరిశీలించి మాట్లాడారు
పశువుల అక్రమ రవాణా ఇసుక వరి ధాన్యం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా పెట్టడం జరిగిందని ఎస్పి చెప్పారు జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులలో 24 గంటలు విసృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికిచేస్తునట్లు తెలిపారు
అంతర్ జిల్లా వాహనాల తనిఖీలను పరిశీలించారు. చెక్ పోస్ట్ రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో ఏడు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ చెక్ పోస్ట్ ల ద్వారా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానత వ్యక్తులకు కదలికలపై పూర్తిస్థాయి నిగా ఉంచామని అన్నారు. వరి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా, పీడీఎస్ బియం, ఇసుక, పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిగా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినట్లైతే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లొ
కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఎస్సై అజయ్ కుమార్, చెక్ పోస్ట్ విధులు నిర్వహణ సిబ్బంది ఉన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY