4గంటల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి
- రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్యధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2 చిత్రంపై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 4గంటల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలన్నారు. చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చేశారని కొనియాడారు. ధురంధర్-1ను మించి ఈ చిత్రం ఉందన్నారు. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతికత, మ్యూజిక్, డిజైన్, డైరెక్షన్‌లో లోపాలే కనిపించలేదన్నారు. నిజమైన ఉత్కంఠను సృష్టించేలా కథలో రచనాశైలి ఉందన్నారు. ఆదిత్యధర్ అమోఘం సృష్టించినట్లు పేర్కొన్నారు.

