స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల రద్దు కోసం రాస్తారోకో…

Sakshitha news

స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల రద్దు కోసం రాస్తారోకో…

క్విట్ ఇండియా స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై నిరసన….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో, ఎస్‌కేఎం పిలుపులో భాగంగా “జైల్ భరో” కార్యక్రమాన్ని పురస్కరించుకుని గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద కార్మిక, రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ఈ. నరేష్, రైతు సంఘం నాయకులు గుమ్మడి వెంకన్న, ఎం. మల్లయ్యలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, కార్మిక–రైతు–ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తోందని విమర్శించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛను విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు కలిసి కార్పొరేట్ శక్తులకు, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కాపాడుకోవాలంటే క్విట్ ఇండియా స్ఫూర్తిని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ రాస్తారోకో కార్యక్రమంలో టి. రాజిరెడ్డి, చిలుక శంకర్, వేల్పుల కుమారస్వామి, జూపాక శ్రీనివాస్, ఎం. దుర్గయ్య, రామాచారి, జి. రాజన్న, లక్ష్మారెడ్డి, ఎస్. రాజేశ్వర్, రావు, బిక్షపతి, ఎస్. ప్రసాద్, కే. ధర్మేందర్, పోగుల శేఖర్, శోభన్ బాబు, రాజేశం, శేఖర్, బత్తుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం సుమారు 100 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Scroll to Top