రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రికి స్వాగతం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ కు స్థానిక ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు
పాత మెటర్నటి హాస్పిటల్ వద్ద ఘన స్వాగతం పలికి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే రాష్ట్ర వైద్య విధానమండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, రాష్ట్ర బీజేవైఎం ప్రధాన కార్యదర్శి నాగోతు హరికృష్ణ, బిజెపి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవి ప్రసాద్, జనసేన పార్టీ తిరుపతి అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
