టీటీడీ బోర్డు మీటింగ్ ను ముట్టడిస్తాం
** తిరుపతి ఏడీ బిల్డింగ్ వద్ద నిరసనలో సీఐటీయూ
……
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీకి చెందిన శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించే దిశగా తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని… లేకుంటే రానున్న టీటీడీ బోర్డు మీటింగ్ ను ముట్టడిస్తామని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు బాలసుబ్రమణ్యం, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎస్.జయచంద్ర టి.సుబ్రహ్మణ్యంలు హెచ్చరించారు. తిరుపతి లోని టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద గత 428 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించాలని తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ శ్రీవారిమెట్లు చిరు వ్యాపారస్తులు లైసెన్స్ ఇవ్వాలని గత 428 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నా… ప్రభుత్వం గానీ, టిటిడి పాలకమండలి గానీ పట్టించుకోవడం లేదన్నారు.
అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగి వినతులు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారు. దాంతో 30 కుటుంబాలు అన్నమో రామచంద్రా… అని ఆకలితో అలమటిస్తున్నారు. వారి కుటుంబాలన్నీ వీధిన పడినాయి. కనికరించాల్సిన పాలకులు వారి చెవులకు కనులకు నిరసన దీక్ష కనపడలేదని ప్రశ్నించారు.
వర్షాలను సైతం లెక్కచేయకుండా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు.
టిటిడి యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్.లక్ష్మి, బుజ్జి, ఉపాధ్యక్షులు వేణు గోపాల్, శ్రీవారి మెట్లు యూనియన్ నాయకులు చిట్టిబాబు, యుగంధర్, చిరంజీవి, ప్రకాష్, పెంచలయ్య, రామ్మూర్తి, మల్లికార్జున, గోపి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
