పేదలకు చూపు రప్పించడమే వి.పి.ఆర్. దృఢ సంకల్పం.

Sakshitha news

పేదలకు చూపు రప్పించడమే వి.పి.ఆర్. దృఢ సంకల్పం.

-సాక్షిత : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పేద ప్రజల కంటి సమస్యలను తీర్చి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే విపిఆర్ నేత్ర సంకల్పమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగారు అన్నారు.. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడవలూరు మండలం కమ్మపాళెంలో ఏర్పాటు చేసిన విపిఆర్ నేత్ర కంటి వైద్య శిబిరంను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఈ విపిఆర్ నేత్ర ప్రాజెక్ట్ నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికలల ప్రాజెక్ట్ అన్నారు. తొలుత ఉదయగిరి నియోజకవర్గంలో ఈ బస్సు ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి 47434 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, అందులో 26434 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశామన్నారు..మొబైల్ బస్సులో అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలు (అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్) ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల వద్దకే వచ్చి కంటి పరీక్షలు చేయడమే కాకుండా, కంటి చూపు సమస్య ఉన్న వారికి కేవలం అరగంట లోపలే అక్కడికక్కడే కళ్లద్దాలు అందిస్తున్నట్లు తెలిపారు.

మరింత తీవ్రమైన సమస్యలు ఉన్న వారికి నిపుణులైన డాక్టర్లు, టెక్నీషియన్లు తదుపరి చికిత్స కోసం తగిన సలహాలు ఇస్తున్నామని వివరించారు.ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చిన అద్భుత స్పందనను చూసి, కేవలం ఒక బస్సుతో ఏడు నియోజకవర్గాలను పూర్తి చేయడం కష్టమని భావించి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరొక బస్సును తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా, కోవూరు నియోజకవర్గంలోని రామతీర్థం నుండి ఈ రెండో బస్సు సేవలను ప్రారంభించామని చెప్పారు.జిల్లాలో వి.పి.ఆర్ నేత్ర ప్రస్తుతం రెండు ప్రత్యేక బస్సులు ద్వారా నిర్వహిస్తున్నామన్నారు.విడవలూరు మండలం లో విపిఆర్ నేత్ర పూర్తి చేశామన్నారు.మండలంలో గల 15 పంచాయతీలలో 7273 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని ,వారిలో అవసరమైన 4759 మందికి కంటి అద్దాలు అందజేశామన్నారు..కొడవవలూరు మండలంలో గల 24 గ్రామ పంచాయతీలలో ఇప్పటివరకు 11 పంచాయతీలలో పూర్తి చేశామన్నారు.

కార్యక్రమం ఇంకా కొనసాగుతోందన్నారు..ఇప్పటివరకు 3022 మందికి పరీక్షలు నిర్వహించామని, రెండు వేల మందికి పైగా కంటి అద్దాలు అందజేశామన్నారు.కోవూరు నియోజకవర్గం లోని 82 గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకూ 26 పంచాయతీలలో విపిఆర్ నేత్ర పూర్తి చేశామన్నారు.ఎండలను సైతం లెక్కచేయకుండా విపిఆర్ ఫౌండేషన్ ఛీఫ్ కోఆర్డినేటర్ ఎన్ శంకర్ ఆధ్వర్యంలో, విపిఆర్ నేత్ర టెక్నికల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏవిఎస్ కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో రెండు క్యాంపులను దిగ్విజయంగా నడుపుతున్న వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top