ఓటరు జాబితాలో పేరు ఉండాలి అంటే ప్రతి ఓటరు తనకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారం పద్దతి ప్రకారం పూరించి ఇస్తేనే జాబితాలో ఓటరుగా పేరు ఉంటుంది
సోమవారం మధ్యాహ్నం నాటికి జిల్లాలో 66 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి – జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి :
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎలెక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పలు సూచనలు ఇవ్వడంతో పాటు జిల్లాలలో జరుగుచున్న ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివరిస్తూ మధ్యాహ్నం నాటికి జిల్లాలో 275570 ఓటర్లకు గాను 182327 ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి వెళ్లి బి.ఎల్. ఓ ల ద్వారా పంపిణీ చేయడం పూర్తి చేసినట్లు తెలిపారు.
ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫారం పూరించి తిరగి బి.
ఎల్ ఒ లకు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటు హక్కు కలిగి ఉన్నవారు సైతం ప్రస్తుతం బూత్ లెవల్ అధికారుల ద్వారా ఇంటింటికి వచ్చి ఇచ్చిన రెండు జతల ఎన్యూమరేషన్ ఫారం ను ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పులు లేకుండా పూరించి సంతకం చేసి ఇస్తేనే కొత్తగా వచ్చే ఓటరు జాబితాలో పేరు ఉంటుందని లేకుంటే జాబితాలో పేరు గల్లంతవుతుందని తెలియజేశారు. ఎన్యూమరేషన్ ఫారంలో మొత్తం మూడు భాగాలు ఉంటుందని, అందులో పై భాగాన రెండు భాగాలు, క్రింది భాగంలో మూడవ భాగం ఉంటుందన్నారు. 2002 నాటి ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు 1, 3వ భాగంలో ఉన్న వివరాలు పూరించాల్సి ఉంటుందని, 2002 తర్వాత ఓటరుగా నమోదు అయిన వారు 2,3వ భాగంలో పూరించాల్సి ఉంటుందని వివరించారు. ఫారం పూరించడంతో పాటు తగిన ఆధారాలు కాపీ ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేశారు.
ఎన్యూమరేషన్ ఫారాలు బి.ఎల్. ఒ లు స్వయంగా ఇంటింటికి వెళ్లి జులై 1లోపు ఇవ్వాల్సి ఉంటుందని, అనంతరం పూరించిన ఫారాలను తిరిగి సేకరించి బి.ఎల్.ఓ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.
వనపర్తి జిల్లాలోని ప్రతి ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను పూరించి బి.ఎల్. ఓ కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు. ప్రతి రోజు బూత్ లెవల్ సూపర్వైజర్లతో తహసీల్దార్లు సమావేశం నిర్వహించి పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ టి. వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఏక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రమేష్ రెడ్డి తదితరులు వి.సి.లో పాల్గొన్నారు.

