ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో తన కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు

Sakshitha news

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో తన కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు…

సాక్షిత : కుత్బుల్లపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాని ఎమ్మెల్సీ, ఏమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ మునిసిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, తాజా మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.