వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి : చిత్రపటానికి నివాళులు అర్పించారు
చాకలి ఐలమ్మ ఉద్యమ స్పూర్తి తో పని చేయాలి
సిపిఎం మండల కార్యదర్శి – ముదిగొండ రాంబాబు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి సభ బుధవారం రోజున ఘనంగా నిర్వహించి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముదిగొండ రాంబాబు మాట్లాడుతూ దేశ్ ముఖ్ లకు, రజాకార్లలకు వ్యతిరేకంగా భూమి కోసం,భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని, ఆనాడు గ్రామాలలో దొరల చేతుల్లో చిన్న కులాల ప్రజలు చేతి వృత్తిదారులు బాధలు గ్రహించి దేశముఖ్ లను, దొరలందరిని తరిమికొట్టిన చరిత్ర చాకలి ఐలమ్మ దని, ఐలమ్మ పొలంలో వేసిన పంటను కోసుకుపోతున్న సమయంలో కమ్యూనిస్ట్ నాయకుల సహాయంతో రజాకార్లకు ఎదురొడ్డి దొరల గడీలను బద్దలు కొట్టిన చాకలి ఐలమ్మ పోరాటం తెలంగాణ అంతాట గొప్ప ప్రభావం చూపిందని,చాకలి ఐలమ్మ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఉద్యమాన్ని నడిపిందని ఆనాటి ప్రజలను చైతన్య పరిచి,విరోచితమైన పోరాటన్ని నిర్వహించిందని సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నిమ్మల మధు,కణితి కాంతారావు,ఓరుగంటి నరేష్, కీసరి నాగరాజు,మంగమ్మ,తానం వీరభద్రం పాల్గొన్నారు.

