వైసిపి వదిలారు…టిడిపిలో కి వచ్చారు
సాక్షిత : బుచ్చిరెడ్డి పాళెం రూరల్ మండలం నాగమాంబాపురం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఒంటేరు శ్రీహరి, పులి విజయ్‌కుమార్, యరగల శ్రీనివాసులు, అంబాటి శ్రీనివాసులు, షేక్ నాగూర్, బి. శశిదర్, షేక్ మౌలాలి, గడ్డం శివ, జి. శ్రీనివాసులు, షేక్ షారుఖ్, కరీంపాటి చంద్ర, చినిగి వంశీ, అంబటి చైతన్య, ముక్కు శ్రీనివాసులు తదితర ముఖ్య నాయకులు నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో వైసిపి వీడి టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కొత్త పాత నాయకులు పరస్పర సమన్వయంలో కలిసి పని చేసుకోవాలని సూచించారు. ప్రజలతో మమేకమై సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ఐకమత్యంగా గ్రామాభివృద్ధికి పాటు పడాలని. కొత్తగా టిడిపిలోకి చేరిన వైసిపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టిడిపిలో చేరుతున్నట్టు నాగమాంబాపురం నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి సీనియర్ నాయకులు బీదా గిరిధర్, బుచ్చి మండల టిడిపి నాయకులు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, బత్తల హరికృష్ణ, మోర్ల మురళి, తదితరులు పాల్గొన్నారు.
