బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో వరసిద్ధి వినాయక అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లోని లయన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక మండపం వద్ద *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * అన్నదాన కార్యక్రమంలో పాల్గోని భక్తులకు వడ్డించారు..
అనంతరం విగ్నేశ్వరుడికి నవరాత్రులు భక్తి, శ్రద్దాలతో పూజలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందినరాని కొనియాడారు..
— గణనాథుడి శోభయాత్ర కార్యక్రమంలో యువతి,యువకులు,భక్తులు,ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, సన్నీ, విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఎర్రోళ్ల విష్ణు, ప్రవీణ్, కేశవ్, ఎర్రోళ్ల శివ, హరీష్, నాని, నాగేష్, గౌతం ప్రసాద్, వీరేశ్, కావలి సాయికిరణ్, దయానంద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..
