జర్నలిస్ట్ మిత్రులకు ఉగాది పురస్కారాలు
జర్నలిస్టు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్
వెటరన్ జర్నలిస్ట్ లకు వారు కోరిన జిల్లాలో ఉచిత బస్ పాస్ సౌక్యం కల్పిస్తాం
జర్నలిస్ట్ లకు త్వరలో శుభవార్త చెప్తాం
ఏపీఎంపీఏ నేతలతో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి : జర్నలిస్ట్ మిత్రులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్లు
రాష్ట్ర సమాచార సంబంధాల శాఖ కొలుసు పార్థసారథి చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో జర్నలిస్టుల సంక్షేమానికి పలు పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని కొలుసు పార్ధ సారధి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం మంత్రిని మీడియా సెంటర్ లో కలసి జర్నలిస్టుల పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ త్వరలోనే తీపి కబురు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ తో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ వెటరన్ జర్నలిస్టులు దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చి రాష్ట్ర కార్యాలయంలో బస్ పాసులు తీసుకోవడం వల్ల సొంత జిల్లాల్లో బస్సు సౌకర్యం కల్పించడం లేదని, వారికి సొంత జిల్లాలోనే పాసులు కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా మంత్రి ని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వెటరన్ జర్నలిస్టులకు పనిచేసే చోటే బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కమిషనర్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించామని త్వరలోనే వారికి శుభవార్త చెబుతామని తెలిపారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అవార్డుల పంపిణీ తో పాటు ప్రమాద బీమా సౌకర్యం,20 లక్షలకు హెల్త్ కార్డుల పరిమితి పెంచడంతో పాటు పలు జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమాలపై త్వరలోనే ఇది విధానము ప్రకటిస్తామని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఏ.పి.ఏం.పి. ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇస్కా రాజేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి చైతన్య, విజయవాడ నగర అధ్యక్షులు టి అనిల్ కుమార్, జనరల్ సెక్రెటరీ జి శ్రీనివాసరావుతో పాటు పలువురు జర్నలిస్టులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY