చలివేంద్రం ప్రారంభించిన కమిషనర్

Sakshitha news

చలివేంద్రం ప్రారంభించిన కమిషనర్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ నారపురెడ్డి మౌర్య ప్రారంభించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరంలో చెలివేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చలి వేంద్రాల ద్వారా సురక్షితమైన చల్లని నీటితో పాటు మజ్జిగ కూడా అందిస్తున్నామని తెలిపారు. అలాగే నగరంలోని ప్రజలకు, వాహన చోదకులకు ఇబ్బందులు లేకుండా కూడళ్ళలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నీడ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఎండల్లో ఎక్కువ తిరగవద్దని తెలిపారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. నగరంలో మరిన్ని చలివేంద్రాలు, నీడ ఏర్పాటు చేసేందుకు దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ ఇంజనీర్ గోమతి, డి.ఈ.మధు, ఎలక్ట్రీకల్ డీఈఈ శిల్ప, పీఆర్వోలు రెడ్డెప్ప, గిరి, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top