సత్యమేవ జయతే యూట్యూబ్ ఛానల్ బ్రోచర్ ఆవిష్కరించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

Sakshitha news

సత్యమేవ జయతే యూట్యూబ్ ఛానల్ బ్రోచర్ ఆవిష్కరించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతిలో నూతనంగా ప్రారంభమవుతున్న “సత్యమేవ జయతే” యూట్యూబ్ ఛానల్ బ్రోచర్‌ను తుడా చైర్మన్, తితిదే ఎక్స్‌అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
“యువత తమ సృజనాత్మకతను ప్రపంచానికి చూపించడానికి యూట్యూబ్ ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తోంది. సామాజిక సమస్యలపై అవగాహన పెంపుతో పాటు, ఎన్నికలు, రాజకీయాలు మరియు దేశాభివృద్ధి వంటి అంశాలపై చైతన్యం సృష్టించడంలో ఇలాంటి వేదికలు కీలకంగా మారుతున్నాయి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సత్యమేవ జయతే యూట్యూబ్ ఛానల్ స్థాపకులు శ్యామ్, ధనంజయ, పవన్ పాల్గొన్నారు.

Scroll to Top