రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ కి నివాళులు
మాజీ మంత్రి, శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తో కలిసి బిఆర్ అంబేద్కర్ నివాళులర్పించిన అడపా మోహన్ మాదిగ
గుంటూరు: భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని, నగరంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు తో కలిసి ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపామోహన్ మాదిగ పాల్గొన్నారు.
డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, రాజ్యాంగ నిర్మాత సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, దేశ సమగ్రతకు, ప్రజల హక్కులకు రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం లాంటిదని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉద్ఘాటించారు.
ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర అధ్యక్షులు అడపామోహన్ మాదిగ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, హక్కుల వల్లనే అణగారిన వర్గాలకు సమాజంలో గౌరవం దక్కిందని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
