గిరిజన సంక్షేమ హాస్టల్ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలి
కార్మికులకు మద్దతుగా, సత్వరమే సమ్మె విరమించేలాగా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ ముందు విద్యార్థులతో నిరసన
సాక్షిత వనపర్తి :
వనపర్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు,ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారికి మద్దతుగా జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహం నందు విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ నేతలు నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగాజిల్లా కార్యదర్శి ఎం.ఆది మాట్లాడుతూ…గత ఎనిమిది రోజుల నుంచి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం వారి సమస్యలు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా విద్యార్థులే వంటలు చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల విద్యార్థులను సమీకరించి వారికి మద్దతుగా ఆందోళన పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్న నాయక్,ఈశ్వర్, మనోజ్ ,మహేష్, శివ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
