పాతనాలపాడు కి నిలిచిన రాకపోకలు
సాక్షిత) నెల్లూరు బ్యూరో డక్కిలి
డక్కిలి డక్కిలి మండలంలోని పాతనాలపాడు గ్రామ పంచాయితీకి వెళ్లే ఎస్సీ ఎస్టీ రోడ్డు మార్గంలో నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, వెంకటగిరి సీఐ ఏవి రమణ, డక్కిలి మండల తాసిల్దార్, ఎంపీడీవో, ఎస్సై శివ శంకర్, మండల స్థాయి సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రజలను అప్రమత్తం చేశారు. డక్కిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోలవరం రెడ్డి కోటేశ్వర్ రెడ్డి కూడా ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని సమీక్షించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
