టి పి సి సి ఉపాధ్యక్షులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ గారి సమక్షంలో AMC డైరెక్టర్ జమీర్ ఆధ్వర్యంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమదుర్గ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, విధానాలను నచ్చి చేరుతున్న 50 మంది ఇతర పార్టి నాయకులు, కార్యకర్తలను బండి రమేష్ స్వాగతం పలుకుతు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టి అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తాయని స్పష్టం చేశారు.
అలాగే దేశంలో ఘనమైన చరిత్రగల పార్టి కాంగ్రెస్ పార్టి, కాంగ్రెస్ పార్టి ఎప్పుడు పేదలకు అండగా ఉండే పార్టి కాంగ్రెస్ పార్టి, సంక్షేమ పథకాలలో ఉచిత బస్సు, గృహ జ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ (పది లక్షల ఆరోగ్య భీమా), ప్రజా ప్రభుత్వం తరపున డ్వాక్రా మహిళా గ్రూపులకు పెట్రోల్ పంపులు,ఆర్టీసీ బస్సుల కాంట్రాక్టులు ప్రభుత్వం ఇస్తుంద న్నారు, రాబోయే రోజులలో అర్హులైన ప్రజలందరికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,ఇతర సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చూస్తానన్నారు, కూకట్ పల్లి నియోజకవర్గం లో పాత డివిజన్ల తో పాటు కొత్తగా ఏర్పాటైతున్న 15 డివిజన్లలో కాంగ్రెస్ పార్టి జండా ఎగురుతే నియోజకవర్గం లో ఇంటిగ్రాటెడ్ స్కూల్స్, విధ్యా, వైద్యం, స్థానిక సమస్యలు, తాగు నీరు, రోడ్లు, డ్రైనేజి, కమ్యూనిటీ హాల్స్ ఇతర అభివృద్ధి తన వంతు కృషి చేస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్లా,యూత్ వైస్ ప్రెసిడెంట్ నజీర్, కూకట్పల్లి యూత్ వైస్ ప్రెసిడెంట్ మోసిన్, మహిళ కాంగ్రెస్ సాయి తులసి, కూకట్పల్లి మండల్ యూత్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, డిస్టిక్ జనరల్ సెక్రెటరీ సల్మాన్,

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
