విద్యార్థులకు టూత్ పేస్టులు, బ్రష్ లు పంపిణీ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / ఏర్పేడు: తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం ఆమందూరు గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా టూత్ పేస్ట్, బ్రష్ లను ఎ.ఆర్.పి (అసోషియేషన్ ఫర్ రూరల్ పూర్) స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ ధర్మారెడ్డి మోహన్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ ఆర్. సురేష్ బాబు, ఉపాధ్యాయులు బాలముని, సరస్వతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ కార్యదర్శి మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతిరోజు స్నానం చేయడం, శుభ్రమైన బట్టలను ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత అనారోగ్యాలను నివారిస్తుందని తెలిపారు. విద్యార్థులందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ బాగా చదువుకొని ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. అలాగే దంత ధావన చేయు సరైన పద్ధతులను విద్యార్థులకు చక్కగా వివరించారు. పాఠశాల సిబ్బంది సంస్థ కార్యక్రమాలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY