అటవీ సంపదను కాపాడే ఏకైక నాయకుడు డిప్యూటీ సీఎం

Sakshitha news

అటవీ సంపదను కాపాడే ఏకైక నాయకుడు డిప్యూటీ సీఎం

** కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

** జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి

సాక్షిత ప్రతినిధి – తిరుపతి:
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అటవీ సంపదను పంది కొక్కుల్లాగా తినేశారని, ఇప్పుడు మా అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ సంపదను కాపాడేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మంగళవారం జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని, డిప్యూటీ సీఎం పర్యటనలో పవన్ కళ్యాణ్ ఏ డ్రెస్సు వేసుకున్నారు ఎలాంటి కళ్ళజోడు పెట్టుకున్నారు అనేది దగ్గరగా గమనిస్తూ కరుణాకర్ రెడ్డి నిత్యం పవన్ కళ్యాణ్ పేరును జపించడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన పాపాలకు నేడు శిక్షలు అనుభవిస్తున్నారని, కల్తీ నెయ్యి వ్యవహారంలో చెట్టు అధికారుల ముందుకు టీటీడీ మాది ఈవో ధర్మారెడ్డి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు విచారణకు హాజరవుతున్నారని ఆరోపించారు. వైసిపి పార్టీలో ఎవరు ఎన్ని తప్పులు చేశారు ఎవరెవరికి శిక్ష పడుతుందో ముందు అది చూసుకోండని కరుణాకర్ రెడ్డికి రాజారెడ్డి సూచించారు. జనసేన పార్టీని మా నేతలను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. తప్పు చేసిన వారెవరైనా ఆ దేవుడి ముందు శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ సంపదను కాపాడేందుకు తన శాయశక్తుల కృషి చేస్తున్నారని, పర్యావరణం ప్రకృతి అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమని చెప్పారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అడ్డగోలుగా అమ్ముకుతు న్నారని వాటిని అరికట్టడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ కొత్త చట్టాన్ని తీసుకురానున్నారని తెలిపారు. జనసేన పార్టీలో ఏ ఒక్కరు అసంతృప్తిలో లేరని మీ నేతలు జనసేన పార్టీ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వాటిని నమ్మే పరిస్థితిలో జనం లేరని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న అది రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని మాకు తెలుసు అన్నారు. మీ కల్లపుల్లి మాటలను తప్పుడు ప్రచారాలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని, మేమంతా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులమని రాజారెడ్డి పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో బాబ్జి, సుభాషిని, మునస్వామి, రాజేష్ ఆచారి, హేమకుమార్, వెంకటేష్, శ్రావణ్,రమేష్, పవన్ పాల్గొన్నారు.

Scroll to Top