హైడ్రా ఉండాలి – చెరువులను కాపాడాలి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకుల ర్యాలీ
“హైడ్రా ఉండాలి – చెరువులను కాపాడాలి” అనే నినాదంతో ఉదయం షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని తమ్మిడిగుంట చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ , తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సెక్రటరీ శ్రీమతి శిరీష సత్తూరు, పట్వారీ శేషిధర్, మన్నెపల్లి సాంబశివరావు, రవి, జయ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణలోని చెరువులు, కుంటలు, నాలాలు వంటి సహజ జలవనరులను పరిరక్షించేందుకు హైడ్రా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగాలని, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
చెరువులను కాపాడడం అంటే భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందించడం అని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ ర్యాలీ ద్వారా చెరువుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
