ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న జర్నలిస్టుల కృషి ఎంతో గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాత్రి నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం వార్తల సేకరణలో అనేక ఇబ్బందులకు గురవుతుంటారని పేర్కొన్నారు. అనునిత్యం పని వత్తిడి లో ఉండే జర్నలిస్టులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కుటుంబ సభ్యులతో ఒకచోట కలుసుకోవడం వేడుకలు జరుపుకోవడం అభినందనీయం అన్నారు.
జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కారం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు అంటే పోర్త్ పిల్లర్ గా గుర్తింపు ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్ షిప్ లు, సర్టిఫికెట్ లను ఆయన అందజేశారు. అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్, ఉపాధ్యక్షులు రాజేష్, అరుణ, జాయింట్ సెక్రెటరీ లు చిలుకూరి హరిప్రసాద్, బాపురావు, కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
