వరంగల్ లో మల్టీ లెవల్ పార్కింగ్..!
వరంగల్ లో మల్టీ లెవల్ పార్కింగ్..!
వరంగల్ నగరంలో పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపుతూ, అధికారులు భద్రకాళి ఆలయం ఎదురుగా ఉన్న 3 ఎకరాల స్థలంలో రూ.20 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ పార్కింగ్‌లో ఒకేసారి 600 కార్లు నిలిపేందుకు వీలు కల్పించనున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో ఇలాంటి పార్కింగ్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అదే తరహాలో వరంగల్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చర్యలు చేపట్టింది.
