పేట రూరల్, మురికిపూడిలో విషాదం – గుంటలో పడి వ్యక్తి మృతి
సాక్షిత : చిలకలూరిపేట రూరల్ మండలం, మురికిపూడి గ్రామంలో గుంటలో పడి కొమ్మని బోయిన అంకమ్మరావు (55) అనే వ్యక్తి మరణించారు. అంకమ్మరావు గేదెల కాపరిగా పనిచేస్తుంటారు.
వివరాల్లోకి వెళ్తే మంగళవారం ఉదయం గేదెలను మేతకు తోలుకెళ్తుండగా, గ్రామ సమీపంలోని ఓ గుంటను దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అంకమ్మరావు అందులో పడిపోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
చిలకలూరిపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని గుంట నుంచి వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
