లే అవుట్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Sakshitha news

లే అవుట్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

** కలెక్టర్ తో కలసి అధికారులకు “తుడ” ఛైర్మన్ ఆదేశం

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శెట్టిపల్లి లే అవుట్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని “తుడ” ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శెట్టిపల్లి లే అవుట్ అభివృద్ధి పనులపై స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో శుక్రవారం
సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో తుడ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ
తిరుపతి శెట్టిపల్లి లే అవుట్ అభివృద్ధి పనులను తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇంజినీరింగ్, అధికారులు, ప్లానింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉండిన శెట్టిపల్లి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో, త్వరలోనే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా యంత్రాంగం సిద్దమవుతున్నదని తెలిపారు. అందులో భాగంగా శెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఔట్ నిర్మాణం జరుగుతుందనీ పేర్కొన్నారు. వాటిలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగు నీటి పైపులు, విద్యుత్ సౌకర్యం, పార్కులు వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అన్నారు.
అందుకోసం ప్రధానంగా లే అవుట్ డెవలప్మెంట్ పనులను సమన్వయం చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని తుడ, రెవెన్యు అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో తిరుపతి రెవెన్యు అధికారి రాంమోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవి కుమారి, తుడా భూ సేకరణ అధికారి సుజన, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ, ఎస్.ఈ కృష్ణా రెడ్డి, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్, ఏకం సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.