కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకం : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ …
131- కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. వెంకటేశ్వర నగర్ అభివృద్ధిలో నూతన సంక్షేమ సంఘం సభ్యులు భాగస్వామ్యులై ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండి కాలనీ అభివృద్ధికై కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు నాగదీప్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మనోహర్ ముదిరాజ్, కోశాధికారి జ్ఞానేశ్వర్ గౌడ్, సలహాదారులు చంద్ర గౌడ్, సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జీ.రాజేశ్వర్ సింగ్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
