సూపర్ గిఫ్ట్ ఇచ్చిన NDA ప్రభుత్వం. సామాన్యుల పై తగ్గనున్న పన్ను భారం

Sakshitha news

సూపర్ గిఫ్ట్ ఇచ్చిన NDA ప్రభుత్వం. సామాన్యుల పై తగ్గనున్న పన్ను భారం – మున్సిపల్ చైర్మన్ రఫాని

చిలకలూరిపేట : మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు జరిగిన సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సవరించిన జీఎస్టీ ద్వారా సామాన్యులపై భారం తగ్గించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సామాన్యులపై పన్ను భారం పడుతూనే ఉంది. సవరించిన జిఎస్టి విధానాల వల్ల ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు అనేక రకమైన వస్తువుల పై ధరలు తగ్గాయి దీనివలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వినియోగదారులకు సరుకులు, సేవల అసలు ధర + పన్ను అనే తేడా స్పష్టంగా తెలుస్తుంది. ముందుగా ఒకే వస్తువుపై దశలవారీగా పన్నులు వేసేవారు (ఉత్పత్తి, హోల్‌సేల్, రీటైల్ స్థాయిల్లో). GSTలో ఆ డబుల్ టాక్సేషన్ తొలగిపోవడంతో వస్తువుల ధరలు తగ్గాయి. ఫలితంగా వినియోగదారుడు సరుకులు తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ జీఎస్టీ గురించి ప్రజలకు ధరల్లో వచ్చిన మార్పుల గురించి ప్రతి షాపులో అమలుపరుస్తున్న జిఎస్టి వివరములను ఆయా షాపుల ముందు ధరలను ప్రదర్శించేలా చర్యలు తీసుకునేలా శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తో చర్చించి అమలుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు , డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జిఎస్టి సుజాత , ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Scroll to Top