మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది……….. ఎమ్మెల్యే మెగా రెడ్డి
సాక్షిత వనపర్తి :
మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందనీ శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మహిళా వారోత్సవాలు జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా “మహిళా ప్రగతి – తెలంగాణ ఉన్నతి” అనే నినాదంతో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ తోకలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు.మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదిగి కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఉపాధి, విద్య మరియు ఆరోగ్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, మహిళా శక్తి అభివృద్ధి చెందితే తెలంగాణ మరింత ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.
ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామీణాభివృద్ధికి వెన్నెముకలుగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ మరియు ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. మహిళల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే డీపీఎంలు నాగమల్లిక, కె. ప్రభాకర్, ఆనంద్ తదితరులు పాల్గొని మహిళా సంఘాల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహిళా శక్తిని ప్రతిబింబించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఓ ఉమాదేవి, వనపర్తి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎస్‌ఎల్‌ఎన్ మాధవి, అదనపు డీఆర్‌డీఓ సరోజ, జెడ్ఎంఎస్ అధ్యక్షురాలు ఇందిరా, జిల్లాలోని 7 మండలాల ఎంఎంఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

