సూపర్ సిక్స్’ పథకాలు సూపర్ హిట్

Sakshitha news

సూపర్ సిక్స్’ పథకాలు సూపర్ హిట్

సాక్షిత : తల్లికి వందనంతో రూ.10,090 కోట్ల ఆర్థిక సాయం

అన్నదాత సుఖీభవ’ కింద 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి

మహిళల ఉచిత బస్సులో దాదాపు 63.61 కోట్ల ప్రయాణాలు

కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక పసుపు పండుగ ‘మహానాడు’ హైబ్రిడ్ విధానంలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈసారి మహానాడును 1875 క్లస్టర్ల నుంచి వేలాది మంది కార్యకర్తలు హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించగా, 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ముఖ్య నాయకుల ప్రసంగాలను ఆన్‌లైన్‌లో విన్నారు.మహానాడు మొదటి రోజు నెల్లూరు, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూటమి ప్రభుత్వ ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ అంశంపై మాట్లాడారు.

ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక సరికొత్త చరిత్రను లిఖిస్తూ, గత ఐదేళ్ల అరాచక పాలనలో, విధ్వంసకర శక్తుల చేతుల్లో నలిగిపోయిన రాష్ట్రాన్ని తన విజన్, అపర చాణక్య నీతితో మళ్లీ ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పాదాభివందనాలు తెలిపారు.అలాగే ఐటీ శాఖామాత్యులు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు కి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కి, సహచర నేతలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే మహిళా అభ్యుదయం కోసం తొలిసారిగా సంస్కరణలు తెచ్చిన స్వర్గీయ నందమూరి తారకరామారావు కి జోహార్లు అర్పించారు. స్త్రీశక్తి థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ మహానాడును ప్రతి క్లస్టర్ నుండి వీక్షిస్తూ, పసుపు పండుగను తమ ఇంట్లో పండగలా జరుపుకుంటున్న ప్రతి కార్యకర్తకూ ధన్యవాదాలు తెలిపారు.

“హైబ్రిడ్ విధానంలో మహానాడు”గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచి, తెలుగుదేశం పార్టీకి బలమైన జిల్లాగా నిరూపించుకున్న నెల్లూరులోనే ఈ మహానాడు జరగాల్సి ఉందని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపుతో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు హైబ్రిడ్ విధానంలో జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. నెల్లూరు గడ్డపై ఈ వేడుక జరగకపోవడం జిల్లా నాయకులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ, బూత్ లెవెల్ నుంచి దాదాపు 6 లక్షల మంది కార్యకర్తలు ఆన్‌లైన్‌లో పాల్గొని పండగలా జరుపుకోవడం చూస్తుంటే ఆ నిరాశ చాలా చిన్న విషయంగా అనిపిస్తోందని అన్నారు.

Scroll to Top