ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంచినీటి సమస్యతో వచ్చిన స్థానికుల ఫిర్యాదుపై సంబంధిత వాటర్ వర్క్స్ జీఎం శ్రీమతి మాధవి తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా జగద్గిరిగుట్ట లో పార్కు ఏర్పాటు గురించి వచ్చిన స్థానికుల వినతి మేరకు సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి తగు చర్యలను తీసుకోవాలని అధికారులను కోరారు, అలాగే ఇతర ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేలా అధికారులకు సూచించారు.

అదేవిధంగా పలువురు స్థానికులు తమ కుటుంబాల్లో జరగనున్న వివిధ శుభకార్యాలకు మరియు దేవాలయాలకు సంబంధించిన సంబంధించిన ఆహ్వాన పత్రికలను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారికి అందజేసి, కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top